Header Banner

ఈ యుగానికి 'టెరా' స్టార్.. ఆధునిక 'ఇంద్రప్రస్థ' అమరావతి రూపశిల్పి! జన్మదిన శుభాకాంక్షలు..

  Sun Apr 20, 2025 06:26        Politics, Wishes (శుభాకాంక్షలు)

నాలుగు దశాబ్దాలుగా ఒక రాజకీయ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచి ఉందంటే... ప్రజలకు ఆ పార్టీతో ఎంత మేలు జరిగి ఉండాలి. తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అని అంటే ఎవరికైనా చెప్పే సమాధానమే ఈ కథనం.. 

 

నారా చంద్రబాబు నాయుడు ప్ర‌స్తుతం ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగానూ కొన‌సాగుతున్నారు. తిరుప‌తి స‌మీపంలోని చంద్ర‌గిరిలో విద్యార్థి నాయ‌కుడిగా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంది. 1978 లో ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారే మినిస్టర్ పదవిని పొందారు. అదే సమయంలో 1980 లో ఆయ‌న ఎన్‌.టీ.ఆర్ కుమార్తె శ్రీమతి భువనేశ్వరి ని పెళ్లి చేసుకున్నారు. 1983 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి చేతిలో ఓట‌మి త‌ర్వాత‌, ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి, తెలుగుదేశం పార్టీలో చేరారు. 

 

1995 లో టీడీపీలో వచ్చిన సంక్షోభంలో ఎమ్మెల్యేలు అందరూ చంద్రబాబును ఏకగ్రీవంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఎన్నుకున్నారు. అప్ప‌టినుంచి 2004 వ‌ర‌కు ఆయ‌న ఏపీ ముఖ్యమంత్రిగా కొన‌సాగారు. అయితే త‌ద‌నంత‌ర ఎన్నిక‌ల్లో ఆయ‌న అధికారాన్ని కోల్పోయారు. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకుని, మొత్తం 175 సీట్ల‌కు గానూ 102 సీట్ల‌ను గెలుచుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అత్య‌ధిక‌ కాలం ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసి చ‌రిత్ర‌ సృష్టించారు. దీంతోపాటు సుదీర్ఘ‌కాలం ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌ని చేసిన రికార్డు కూడా ఆయ‌న‌దే. 

 

28 ఏళ్ల వ‌య‌సులో రాష్ట్రంలో అతి పిన్న వ‌య‌స్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా పేరు గాంచారు. 1999 లో ఆయ‌న నేతృత్వంలోని టీడీపీ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో 294 సీట్ల‌కు గాను 185 స్థానాలు, 42 లోక్‌స‌భ సీట్ల‌కు గానూ 29 సీట్లు సాధించి, ఎన్‌డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. 2003 లో జ‌రిగిన మందుపాత‌ర దాడి నుంచి ఆయ‌న సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ దాడిలో ఆయ‌న మెడ ఎముకలు, త‌ల‌కు గాయాల‌య్యాయి. 

 

ఇకపోతే ఆయన బాల్యంలో పాఠ‌శాల‌కు వెళ్లేందుకు, తొమ్మిదో త‌ర‌గ‌తి వర‌కు ఆయ‌న ప్ర‌తిరోజూ 11 కిలో మీట‌ర్లు న‌డిచి వెళ్లేవారట. 1992 లో ఆయ‌న హెరిటేజ్ సంస్థ‌ను స్థాపించారు. ఆ సంస్థ ప్ర‌స్తుతం ద‌క్షిణ భార‌త దేశంలో అతి పెద్ద ప్రైవేట్ డెయిరీల‌లో ఒక‌టిగా ఉంది. 

 

హైదరాబాద్ అభవృద్ధికి పునాది:
ప్రధానంగా నగరాలకు విదేశీ పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ ఔట్సోర్సింగ్ సర్వీసెస్" వంటి ముఖ్య విభాగాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికోసం ప్రణాళికను సిద్ధం చేశారు. లక్ష్య సాధన కోసం అతను "బై బై బెంగళూర్, హలో హైదరాబాద్" నినాదానికి పిలుపునిచ్చారు. ఆయన కృషితో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటు సెంటర్‌ను స్థాపించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సీయాటెల్ నగరంలో ఉన్న సంస్థ తరువాత ఇది రెండవ కేంద్రం. ఆయన ఐ.బి.ఎం., డెల్, డెలోఇట్ట్‌, కంప్యూటర్ అసోసియేట్స్ అండ్ ఓరాకిల్ వంటి ఇతర ఐ.టి కంపెనీలను హైదరాబాదులో నెలకొల్పడానికి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. 

 

హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సి.ఇ.ఓ లను ఒప్పించేందుకు ఎంతో కృషిచేసాడు. 2003-04 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాదు నుండి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది దేశంలో నాల్గవ అతి పెద్ద ఎక్స్పోర్ట్ నగరంగా మారింది. 2013-14 లో ఎగుమతులు 10 రెట్లు పెరిగాయి. దీని ఫలితంగా హైదరాబాదులో IT & ITES రంగాలలో 320,000 మందికి ఉపాధి లభించింది. 

 

అమరావతి శంకుస్థాపన:
2015 అక్టోబరు 22న అత్యంత వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు జరిగింది. మోదీతోపాటు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖరరావు కూడా ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమల మంత్రులిద్దరు కూడా పాల్గొన్నారు. 

 

2024 ఎన్నికల్లో ఘన విజయం:
తెలుగు దేశం పార్టీకి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఓడించి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ మొత్తం 175 శాసన సభ స్థానాలకు గానూ 135 స్థానాల్లో విజయం సాధించింది. చంద్రబాబు సారథ్యంలోని ఎన్‌డిఏ కూటమి 164 స్థానాల్లో గెలుపొంది, మునుపెన్నడూ లేనంత మెజారిటీ సాధించింది. రాయలసీమతో సహా ప్రతి చోటా కూటమి ఏకపక్ష విజయాలు సాధించడం జరిగింది. వైసీపీ 8 ఉమ్మడి జిల్లాల్లో తుడిచి పెట్టుకు పోయింది. తెలుగు దేశం పార్టీ 135 స్థానాలతో ఆధిక్యం కోనసాగింది. జనసేన పార్టీ 21 స్థానాలు గెలిచి 100 శాతం ఫలితంతో భారీ సంచలనం సృష్టించింది. భారతీయ జనతా పార్టీ 8 చోట్ల గెలుపొందింది. 

 

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న పదవీకాలంలో అమలు చేయబడిన ముఖ్యమైన చట్టాలు:
- ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల (రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) చట్టం, 2000 - రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల ఉప-వర్గీకరణ కోసం , దీనిని తరువాత భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని భావించింది.
- సింగిల్ విండో చట్టం, 2002 – పారిశ్రామిక ఆమోదాలను ప్రాసెస్ చేయడానికి బలమైన సింగిల్-విండో వ్యవస్థను ఏర్పాటు చేయడానికి.
- ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ చట్టం, 2014 – ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ స్థాపన కోసం .
- పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారెంటీ చట్టం, 2018 – BRAP 2017 నివేదిక సిఫార్సుల ఆధారంగా, పరిశ్రమ స్నేహపూర్వకతను పెంపొందించడానికి మరియు సమర్థవంతమైన ప్రజా సేవను నిర్ధారించడానికి. 
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ, చంద్రన్న బీమా, చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న రంజాన్ తౌఫా, చంద్రన్న కాపు భవన్ చంద్రన్న పెళ్లి కానుక మొదలైన మొత్తం 21 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రవాసి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Wishes #HBDCBN #NCBN #ChandrababuNaidu #Birthday #TDP #NaraCBN #Nara #ChandraBabu #75thBday #NaraLokesh